సుమిత్‌కు జాక్‌పాట్‌

Mar 7,2024 22:05 #Sports

నాదల్‌ నిష్క్రమణతో ఇండియన్‌ వెల్స్‌ మెయిన్‌ డ్రాకు అర్హత

న్యూయార్క్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నాగల్‌కు జాక్‌పాట్‌ తగిలింది. మెయిన్‌ డ్రా అర్హత రౌండ్‌ తుదిపోరులో ఓడిన సుమిత్‌.. టాప్‌సీడ్‌ రఫెల్‌ నాదల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ప్రధాన టోర్నీకి సుమిత్‌కు చోటు దక్కింది. నాదల్‌ ఈ టోర్నీలో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ.. పూర్తిస్థాయిలో ఫిట్‌నెట్‌ సాధించకపోవడంతో తొలిరౌండ్‌ మ్యాచ్‌కుముందు వైదొలుగుతున్నట్లు నిర్వాహకులకు తెలిపాడు. గత ఏడాది జనవరి నుంచి ప్రధాన టోర్నమెంట్‌లకు దూరంగా ఉంటున్న నాదల్‌.. జనవరిలో జరిగిన బ్రిస్బేన్‌ టోర్నీలో తిరిగి రాకెట్‌ పట్టాడు. ఆ టోర్నీ మధ్యలోనే కండరాల నొప్పితో తిరిగి వైదొలిగాడు. గత ఆదివారం లాస్‌ వెగాస్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో సహచర ఆటగాడు కార్లోస్‌ అల్కరాజ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. నాదల్‌ టోర్నీనుంచి నిష్క్రమించడం తమకు నిరాశ కలిగించిందని డైరెక్టర్‌ టామీ హాస్‌ తెలిపాడు. ఇక నాదల్‌ స్థానంలో ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన 26ఏళ్ల సుమిత్‌ క్వాలిఫయింగ్‌ రెండోరౌండ్‌లో ఓటమిపాలయ్యాడు. ఏటిపి ర్యాంకింగ్స్‌లో నాదల్‌ 101వ స్థానంలో ఉండగా.. చివరి మ్యాచ్‌లో ఓడి ప్రధాన టోర్నీకి అడుగు దూరంలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగే తొలిరౌండ్‌ పోటీలో సుమిత్‌ కెనడాకు చెందిన ఎం. రోనిక్‌తో తలపడనున్నాడు.

➡️