సెమీస్‌కు ముంబయి, తమిళనాడు

Feb 27,2024 22:15 #Sports

రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్స్‌

ముంబయి: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి ముంబయి, తమిళనాడు జట్లు ప్రవేశించాయి. ముంబయి-బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా కాగా.. సౌరాష్ట్రను చిత్తుచేసి తమిళనాడు జట్టు సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో బరోడాతో మ్యాచ్‌ను ముంబయి జట్టు డ్రా చేసుకొని తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతను సాధించింది. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 384పరుగులు చేయగా.. బరోడా 348 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముంబయి 569 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో 10, 11వ బ్యాటర్స్‌ సెంచరీలతో రాణించి రికార్డు నెలకొల్పారు. దీంతో 605పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బరోడా చివరిరోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సౌరాష్ట్రను తమిళనాడు జట్టు ఇన్నింగ్స్‌ 33 పరుగుల తేడాతో ఓడించింది. మరో క్వార్టర్‌ఫైనల్లో విదర్భ జట్టు 127పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తుచేసి సెమీస్‌కు చేరగా.. నాలుగు పరుగుల దూరంలో ఆంధ్రాజట్టు మధ్యప్రదేశ్‌ చేతిలో ఓటమిపాలవ్వడంతో మధ్యప్రదేశ్‌ సెమీస్‌కు చేరింది.మార్చి 2-6వరకు సెమీస్‌, 10-14న ఫైనల్‌ జరగనున్నాయి. సెమీఫైనల్స్‌…

మధ్యప్రదేశ్‌ × విదర్భ

తమిళనాడు × ముంబయి

➡️