34మందితో హాకీ మహిళల జాతీయ శిక్షణ శిబిరం

Dec 26,2023 22:10 #Sports

న్యూ ఢిల్లీ : జాతీయ మహిళల హాకీ శిక్షణా శిబిరం 34మంది ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు దేశాల హాకీ టోర్నమెంట్‌కు జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) ఎంపిక చేయనుంది. సీనియర్‌ మహిళల హాకీ శిక్షణా క్యాంప్‌కు ఎంపికైన ఆటగాళ్లను హెచ్‌ఐ మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది రాంచీ వేదికగా జనవరి 13-19న ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ జరగనుంది. గ్రూప్‌-బిలో భారత్‌తోపాటు న్యూజిలాండ్‌, ఇటలీ, అమెరికా జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్‌ాఎలో జర్మనీ, జపాన్‌, చిలీ, చెక్‌ రిపబ్లిక్‌ జట్లు ఉన్నాయి. జకార్తా వేదికగా జరిగిన మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్‌తోపాటు స్పెయిన్‌, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్‌ జట్లు టోర్నమెంట్‌లో ఆడనున్నాయి.

శిక్షణా శిబిరానికి ఎంపికైన ఆటగాళ్లు..

గోల్‌కీపర్లు: సవిత, రజని, బిచ్ఛూదేవి, బన్సారి సోలంకి

డిఫెండర్లు: దీప్‌ గ్రేస్‌ ఎక్కా, గుర్జీత్‌ కౌర్‌, నిక్కి ప్రధాన్‌, ఉదిత, ఇషికా చౌదరి, అక్షత దేహలే, జ్యోతి ఛత్రి, మహిమా చౌదరి

మిడ్‌ఫీల్డర్లు: నిషా, సలీమా, సుశీల, జ్యోతి, నవ్‌జ్యోత్‌ కౌర్‌, మౌనిక, మరీనా కుజుర్‌, నేహా, బల్జీత్‌ కౌర్‌, రీనా ఖోఖర్‌, వైష్ణవి విఠల్‌, అజ్మినా కుజుర్‌.

ఫార్వర్డ్స్‌ : లాల్‌రిమిసిమి, నవ్‌నీత్‌ కౌర్‌, వందన కటారియా, షర్మిలా దేవి, దీపిక, సంగీత కుమారి, ముంతాజ్‌ ఖాన్‌, సునీత టప్పా, బ్యూటీ డంగ్‌దంగ్‌.

 

➡️