ఎంఎస్‌ ధోనీకి అరుదైన గౌరవం .. బీసీసీఐ కీలక నిర్ణయం

MS Dhoni Jersey : భారత జట్టుకు ఎంతో సేవ చేసిన ధోనీ గౌరవార్థం బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ ధోనీ ‘జెర్సీ నంబర్‌ 7’కి రిటైర్‌ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ జెర్సీ ధరించి భారత క్రికెటర్‌ ఎవరూ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌ ఆడరు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ‘జెర్సీ నంబర్‌ 10’కి బీసీసీఐ గతంలో రిటైర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జెర్సీ నంబర్‌ 10 తర్వాత ఇప్పుడు జెర్సీ నంబర్‌ 7కు బీసీసీఐ రిటైర్‌ ఇచ్చింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా.. ఎంఎస్‌ ధోనీకి ఈ అరుదైన గౌరవం ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు.

భారత క్రికెట్‌ జట్టులో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీది ప్రత్యేక స్థానం. బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గానే కాకుండా.. కెప్టెన్‌గా రాణించి అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ సహా 2013 ఛాంపియన్‌ ట్రోఫీని భారత జట్టుకు ధోనీ అందించారు. మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. ప్రపంచ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగిన మహీ.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చారు. భారత జట్టుకు ఎంతో సేవ చేసిన ధోనీ గౌరవార్థం … ఎంఎస్‌ ధోనీ ‘జెర్సీ నంబర్‌ 7’కి రిటైర్‌ ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

➡️