గెలుపునకు చేరువలో ఆంధ్ర

Jan 22,2024 10:49 #Sports

అస్సాంతో రంజీట్రోఫీ

డిస్పూర్‌(అస్సాం): రంజీట్రోఫీ గ్రూప్‌ లీగ్‌లో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. ఆంధ్ర జట్టు మూడోరోజై ఆదివారం 9వికెట్ల నష్టానికి 334పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయడంతో అస్సాం ముందు 363పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగల్గింది. భారీ లక్ష్యంతో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన అస్సాం జట్టు ఆట నిలిచే సమయానికి 5వికెట్ల నష్టానికి 81పరుగులు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌(46) తోడు సుమిత్‌(6) ఉన్నారు. ఆంధ్ర బౌలర్లు గిరినాథ్‌కు మూడు, లలిత్‌ మోహన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆంధ్ర జట్టు కెప్టెన్‌ రికీ బురు(125) సెంచరీకి తోడు హనుమ విహారి(63) అర్ధసెంచరీతో రాణించారు. అస్సాం బౌలర్‌ సిద్ధార్ధ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అస్సాం జట్టు చివరిరోజు 66ఓవర్లలో 282పరుగులు చేయాల్సి ఉండగా.. మరో ఐదు వికెట్లు కూలిస్తే ఆంధ్రకు విజయం దక్కనుంది.

➡️