ఆర్చర్‌ను ఐపీఎల్‌లో ఆడొద్దన్న ఈసీబీ

Dec 5,2023 17:51 #Cricket

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉండాలని పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను ఈసీబీ ఆదేశించింది. 2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు పనిభారం నిర్వహణలో భాగంగా ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఐపీఎల్‌ కోసం రూ.8 కోట్లకు ఆర్చన్‌ను కొనుక్కున్న ముంబయి ఇండియన్స్‌ గతవారం అతడిని విడుదల చేసింది. ఈనెల 19న దుబారులో జరిగే ఆటగాళ్ల వేలంపై ఆసక్తి చూపిన క్రికెటర్ల జాబితాలోనూ ఆర్చర్‌ పేరు లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో గాయపడిన ఆర్చర్‌.. అప్పట్నుంచి ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ అతను ఆడలేదు. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ జరిగే ఏప్రిల్‌, మే నెలల్లో ఆర్చర్‌ ఇంగ్లాండ్‌లో ఉంటే అతని పునరాగమనం సాఫీగా జరుగుతుందని ఈసీబీ భావిస్తోంది.

➡️