IPL 2024: కోల్‌కతా ప్లేయర్‌కి భారీ ఫైన్

Mar 24,2024 10:36 #2024 ipl, #Cricket, #kkr vs srh
  • మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్‌లను ఔట్ చేసిన సందర్భాల్లో అనుచిత ప్రవర్తన
  •  బౌలర్ హర్షిత్ రాణాకు మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధింపు

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో కోల్‌కతా బౌలర్ కు భారీ ఫైన్ పడింది. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌పై కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి కోల్‌కతాను గెలిపించిన ఆ జట్టు ఆటగాడు హర్షిత్ రాణాకు భారీ ఫైన్ పడింది. స్టార్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్‌లను ఔట్ చేసిన సందర్భాల్లో దరుసుగా ప్రవర్తించాడు. ‘బయటకు వెళ్లండి’ అనేలా అనుచితంగా సైగలు చేశాడు. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధిస్తూ ఐపీఎల్ పాలకమండలి ప్రకటన విడుదల చేసింది.

➡️