రాణించిన జడేజా, ధోనీ

Apr 19,2024 23:05 #Sports

చెన్నై సూపర్‌కింగ్స్‌ 176/6
లక్నో: చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు తొలుత తడబడ్డా.. చివర్లో చెలరేగాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 176పరుగులు చేసింది. తొలుత 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన చెన్నై కోలుకోలేదు. శివం దూబే(3)ను స్టోయినిస్‌ తొలి బంతికే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ సమీర్‌ రిజ్వీ(0) భారీ షాట్‌ ఆడబోయి స్టంపౌట్‌ అయ్యాడు. దాంతో, 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సీఎస్కే గౌరవప్రదమైన స్కోర్‌ కోసం పోరాడుతోంది. ప్రస్తుతం జడేజా.. మోయిన్‌ అలీ(7)తో ఇన్నింగ్స్‌ నిర్మిస్తున్నాడు. 15 ఓవర్లకు చెన్నై స్కోర్‌.. 105/5. టాస్‌ ఓడిన సీఎస్కేకు ఆదిలోనే షాక్‌. ఫామ్‌లో లేని ఓపెనర్‌ రచిన్‌ రవింద్ర(0)ను మొహ్సిన్‌ ఖాన్‌ బౌల్డ్‌ చేసి లక్నోకు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపే యశ్‌ ఠాకూర్‌ సూపర్‌ బాల్‌తో రుతురాజ్‌ గైక్వాడ్‌(17)ను వెనక్కి పంపాడు. దాంతో, 33 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్‌ పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన జడ్డూ.. అజింక్యా రహానే(36)తో కలిసి ధాటిగా ఆడాడు. అయితే.. ఈ జోడీని విడదీసేందుకు రాహుల్‌ స్పిన్‌ అస్త్రమైన కఅనాల్‌ పాండ్యాను రంగంలోకి దించి ఫలితం సాధించాడు. రహానే బౌల్డ్‌ అయ్యాక వచ్చిన దూబే(3)ను స్టోయినిస్‌ తెలివిగా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కఅనాల్‌ ఊరించే బంతి వేయగా.. రిజ్వీ తొందరపాటుకు గురై స్టంపౌట్‌ అయ్యాడు. చెన్నై 5 వికెట్లు కోల్పోయాక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(57), ధోనీ(28) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగారు. దీంతో చెన్నై జట్టు గౌరవప్రద స్కోర్‌ చేసింది. లక్నో బౌలర్లు కృనాల్‌ పాండ్యకు రెండు, మొహిసిన్‌, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోరు, స్టొయినీస్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (బి)కృనాల్‌ పాండ్య 36, రచిన్‌ రవీంద్ర (బి)మొహిసిన్‌ ఖాన్‌ 0, గైక్వాడ్‌ (సి)కెఎల్‌ రాహుల్‌ (బి)యశ్‌ ఠాకూర్‌ 17, జడేజా (నాటౌట్‌) 57, శివమ్‌ దూబే (సి)కెఎల్‌ రాహుల్‌ (బి)స్టొయినీస్‌ 3, సమీర్‌ రిజ్వి (స్టంప్‌)కెఎల్‌ రాహుల్‌ (బి)కృనాల్‌ పాండ్య 1, మొయిన్‌ అలీ (సి)ఆయుష్‌ బడోని (బి)రవి బిష్ణోరు 30, ధోనీ (నాటౌట్‌) 28, అదనం 4, (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 176పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/33, 3/68, 4/87, 5/90, 6/141
బౌలింగ్‌: హెన్రీ 3-0-26-0, మొహిసిన్‌ ఖాన్‌ 4-0-37-1, యశ్‌ ఠాకూర్‌ 4-0-45-1, కృనాల్‌ పాండ్య 3-0-16-2, రవి బిష్ణోయ్ 4-0-44-1, స్టొయినీస్‌ 2-0-7-1

➡️