రంజీ ట్రోఫీకి కేరళ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌

Dec 25,2023 18:32 #Cricket, #Sports

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్‌ ఆసోషియేషన్‌ ప్రకటించింది. మొదటి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టు కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ ఎంపికయ్యాడు. సంజూకు డిప్యూటీగా రోహన్‌ కునుమ్మల్‌ వ్యవహరించనున్నాడు. వచ్చే రంజీ సీజన్‌లో కేరళ తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ జనవరి 5 నుంచి అలప్పుజా వేదికగా ప్రారంభం కానుంది.

రంజీ ట్రోఫీకి కేరళ జట్టు: సంజు శాంసన్‌ (కెప్టెన్‌), రోహన్‌ కున్నుమ్మల్‌ (వైస్‌ కెప్టెన్‌), కష్ణ ప్రసాద్‌, ఆనంద్‌ కృష్ణన్‌, రోహన్‌ ప్రేమ్‌, సచిన్‌ బేబీ, విష్ణు వినోద్‌, అక్షయ్ చంద్రన్‌, శ్రేయాస్‌ గోపాల్‌, జలజ్‌ సక్సేనా, వైశాక్‌ చంద్రన్‌, బాసిల్‌ థంపి, విశ్వేశ్వర్‌ ఎ సురేష్‌, ఎం డి నిధీష్‌, బాసిల్‌, విష్ణు రాజ్‌

➡️