ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్‌ షమీ

Nov 26,2023 10:48 #shami, #Sports

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడి టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తన మంచి మనసును చాటుకున్నాడు. శనివారం అర్ధ రాత్రి షమీ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో తన ముందు వెళ్తున్న ఓ కారు కొండపై నుంచి కిందకి దూసుకు వెళ్లింది. ఈ క్రమంలో షమీ వెంటనే తన కారును ఆపి.. కొంతమంది సాయంతో కారులోని వ్యక్తిని బయటకు తీసి కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షమీ షేర్‌ చేశాడు. ‘ఇతడు చాలా అదష్టవంతుడు. దేవుడు అతడికి రెండు జీవితాలు ఇచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్‌ రోడ్డుపై మా కారు ముందు వెళ్తున్న వాహనం కింద పడిపోయింది. అతడిని మేము సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం’ అని షమీ రాసుకొచ్చాడు.

➡️