నగాల్‌ @ 80వ ర్యాంక్‌

Apr 15,2024 23:57 #Sports, #Tennis
  • కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌తో రికార్డుపుటల్లో..

లండన్‌: భారత యువ టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ మరో ఘనత సాధించాడు. కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌లో నిలిచాడు. తాజాగా అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘం(ఎటిపి) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 80 స్థానంలో నిలిచాడు. మాంటె కార్లే మాస్టర్స్‌ టోర్నీలో నగాల్‌ 93వ ర్యాంకర్‌గా బరిలోకి దిగాడు. తొలి రౌండ్‌లో 64వ సీడ్‌ ప్లావికో కొబిల్లిని(ఇటలీ)ని ఓడించి మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు. తద్వారా 26ఏళ్ల నగాల్‌ 13 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెర్తు ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు. హర్యానాకు చెందిన నగాల్‌ 8ఏళ్ల వయసులోనే రాకెట్‌ అందుకున్నాడు. స్థానిక స్పోర్ట్స్‌ క్లబ్‌లో తన ఆటకు మెరుగులు దిద్దుకున్న అతడు 2015లో వింబుల్డన్‌ పురుషుల డబుల్స్‌ జూనియర్‌ టైటిల్‌ నెగ్గాడు. దాంతో, జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ గెలుపొందిన ఆరో భారత టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పురుషుల సింగిల్స్‌లో నిలకడగా రాణిస్తున్న నగాల్‌ ఈ ఏడాది ఆరంభం నుంచి జోరు కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు క్వాలిఫై కావడంతో పాటు తొలి రౌండ్‌కు చేరాడు. తద్వారా గ్లాండ్‌స్లామ్‌ చేరిన మూడో భారత ఆటగాడిగా నగాల్‌ చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత జరిగిన ఇండియన్‌ వెల్స్‌, మాంటో కార్లే మాస్టర్స్‌ టోర్నీలోనూ నగాల్‌ తన మార్క్‌ ఆటతో ఆకట్టుకున్నాడు. దాంతో, తొలిసారి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌తో చరిత్రపుటల్లో నిలిచాడు.

➡️