ఐఎల్‌టీ20 లీగ్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌పై నిషేధం

Dec 19,2023 08:41 #Cricket, #Sports

ఆఫ్ఘనిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌పై ఇంటర్నేషల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20) నిషేధం విధించింది. ఫ్రాంచైజీ షార్జా వారియర్స్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆయన్ను 20 నెలలపాటు బ్యాన్‌ చేసింది. ఈ ఏడాది ప్రారంభమైన ఐఎల్‌టీ20లో నవీన్‌ షార్జా వారియర్స్‌ తరఫున ఆడారు. ఈ సీజన్‌లో సత్తాచాటిన అతను 11 వికెట్లతో హయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచారు. దాంతో రెండో సీజన్‌కు నవీన్‌ ఉల్‌ హక్‌ కాంట్రాక్ట్‌ను పొడిగించాలని ఫ్రాంచైజీ రిటెన్షన్‌గా నోటీసు పంపగా.. దాన్ని నవీస్‌ తిరస్కరించారు. దాంతో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు గుర్తించిన లీగ్‌ మేనేజ్‌మెంట్‌ ఆయనపై నిషేధం విధించింది. దాంతో నవీన్‌ ఉల్‌ హక్‌ 2024, 2025 సీజన్లకు దూరం కానున్నారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు చెందిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో నవీన్‌ ఉల్‌ హక్‌ ఒప్పందం చేసుకున్నారు.

➡️