రోయింగ్‌లో బల్‌రాజ్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

Apr 21,2024 21:38 #Olympics, #Sports
  • ఆసియా ఓషియానా ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌

సియోల్‌(ద.కొరియా): భారత రోయర్‌ బల్‌రాజ్‌ పన్వర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ రెగట్టా పోటీల్లో బల్‌రాజ్‌ రికార్డుస్థాయిలో 7నిమిషాల 1.27సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్‌ తరఫునుంచి రోయింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించిన తొలి రోయర్‌గా బల్‌రాజ్‌ నిలిచాడు. బల్‌రాజ్‌ గత ఏడాది చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో నాల్గో స్థానంలో నిలిచి ఒలింపిక్‌ బెర్త్‌, పతకం సాధించడంలో విఫలమయ్యాడు.

➡️