ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించిన పాకిస్థాన్

Jan 21,2024 11:42 #Cricket, #Sports

హైదరాబాద్: న్యూజిలాండ్ గ‌డ్డ‌పై జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది. ఆదివారం జ‌రిగిన ఐదో టీ20లో 42 ప‌రుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. పాక్ నిర్దేశించిన 134 ప‌రుగుల ఛేద‌న‌లో న్యూజిలాండ్ 92 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. క్రిస్ట్‌చ‌ర్చ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 8 వికెట్ల న‌ష్టానికి 134 ర‌న్స్ చేసింది. మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ.. ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్(38), ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌(33), ష‌హిబ్‌జ‌దా ఫ‌ర్హాన్‌(19)లు రాణించ‌డంతో పాక్ 8 వికెట్ల న‌ష్టానికి 134 ర‌న్స్ చేసింది. మరో ఓపెన‌ర్ ఫిన్ అలెన్‌(22), టిమ్ సీఫ‌ర్ట్(19)లు జ‌ట్టును ఆదుకున్నారు. అయితే.. ఇఫ్తికార్ సీఫ‌ర్ట్‌, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీల‌ను ఔట్ చేసి కివీస్‌ను దెబ్బ కొట్టాడు. చివ‌ర్లో గ్లెన్ ఫిలిఫ్స్‌(26) దంచికొట్టినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు.

➡️