కతార్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత స్వైటెక్‌

Feb 19,2024 20:51 #Cricket, #Sports

కతార్‌: కతార్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ చేజిక్కించుకుంది. ఫైనల్లో స్వైటెక్‌ 7-6(10-8), 6-2తో ఎలెనా రైబకినా(రష్యా)పై వరుససెట్లలో నెగ్గింది. దీంతో 2013-15 సెరెనా విలియ్సన్‌ తర్వాత వరుసగా మూడు డబ్ల్యుటిఏ టైటిళ్లు నెగ్గిన తొలి క్రీడాకారిణిగా స్వైటెక్‌ రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో తొలి సెట్‌ టైబ్రేక్‌కు దారితీయగా.. టైబ్రేక్‌లో 1-4పాయింట్లతో వెనుకబడ్డ స్వైటెక్‌.. ఆ తర్వాత వరుసగా సాయింట్లు సాధించింది ఆ గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో సెట్‌లో ప్రత్యర్ధి రెండు సర్వీసులను బ్రేక్‌ చేసిన స్వైటెక్‌ ఆ సెట్‌ను సునాయాసంగా చేజిక్కించుకొని టైటిల్‌ను కైవసం చేసుకుంది.

➡️