జేసన్‌ రాయ్ స్థానంలో సాల్ట్‌ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊరట లభించింది. జేసర్‌ రాయ్ ఈ సీజన్‌ ఐపిఎల్‌కు దూరం కావడంతో అతని స్థానంలో సాల్ట్‌ను రీప్లేస్‌ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో ఐపిఎల్‌ 2024కు దూరంగా ఉండాలని జేసన్‌ రాయ్ నిర్ణయించుకోగా.. అతని స్థానంలో ఫిల్‌ సాల్ట్‌(ఇంగ్లండ్‌)ను చేర్చుకుంది. అతను గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో తరఫున ఆడాడు. రూ. 1.50 కోట్ల బేస్‌ ధరతో సాల్ట్‌ను కోల్‌కతా కొనుగోలు చేసింది. రాయ్ ని రూ.2.8 కోట్లకు ఉండగా.. అతను గత సీజన్‌లో ఎనిమిది మ్యాచుల్లో 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు. ఇక 27ఏళ్ల సాల్ట్‌ 2023లో తొలిసారి ఐపిఎల్‌లో అరంగేట్రం చేయగా.. ఢిల్లీ అతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 163.91 స్ట్రయిక్‌ రేట్‌తో 218 పరుగులు చేశాడు.

➡️