‘శివ’మెత్తిన దూబే

Jan 12,2024 09:54 #Sports
  • బౌలింగ్‌లో రాణించిన ముఖేశ్‌, అక్షర్‌
  • తొలి టి20లో ఆఫ్ఘన్‌పై టీమిండియా ఘన విజయం

మొహాలీ : ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టి20లో బ్యాటింగ్‌లో శివమ్‌ దూబే, బౌలింగ్‌లో ముఖేశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ను భారత బౌలర్లు కట్డడి చేయడంలో నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 158పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియాకు 17.4ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 159పరుగులు చేసి ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌ రెండో బంతికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0)డకౌట్‌ అయ్యాడు. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ల మధ్య సమన్వయలోపంతో రోహిత్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత శివమ్‌ దూబే(60నాటౌట్‌; 40బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధసెంచరీకి తోడు శుభ్‌మన్‌(23), తిలక్‌ వర్మ(26), జితేశ్‌ శర్మ(31) సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు. చివర్లో దూబే, రింకు సింగ్‌(16నాటౌట్‌; 2ఫోర్లు) మరోవికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఆఫ్ఘన్‌ బౌలర్లు ముజీబ్‌కు రెండు, అజమతుల్లాకు ఒక వికెట్‌ దక్కాయి. అంతముందు టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ను ఆలౌట్‌ చేయకపోయినా, భారీ స్కోరు సాధించకుండా కట్టడి చేశారు. నబీ(42; 27బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), నజీబుల్లా జాద్రాన్‌(19; 11బంతుల్లో 4ఫోర్లు) చివర్లో ధాటిగా ఆడారు. రహ్మనుల్లా గుర్బాజ్‌(23), కెప్టెన్‌ ఇబ్రహీం జాద్రాన్‌(25), అజ్మతుల్లా ఒమర్జారు(29) బ్యాటింగ్‌లో రాణించారు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, ముఖేశ్‌ కుమార్‌కు రెండేసి, శివమ్‌ దూబేకు ఒక వికెట్‌ తీశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శివమ్‌ దూబేకు లభించగా.. రెండో టి20 ఇండోర్‌ వేదికగా ఆదివారం జరగనుంది.

స్కోర్‌బోర్డు..

ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)జితేశ్‌ (బి)అక్షర్‌ 23, జడ్రాన్‌ (సి)రోహిత్‌ (బి)దూబే 25, ఒమర్జారు (బి)ముఖేష్‌ 29, రామత్‌ షా (బి)అక్షర్‌ 3, మహ్మద్‌ నబి (సి)రింకు సింగ్‌ (బి)ముఖేశ్‌ 42, నజీబుల్లా (నాటౌట్‌) 19, కరీమ్‌ జనత్‌ (నాటౌట్‌) 9, అదనం 8. (20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 158పరుగులు. వికెట్ల పతనం: 1/50, 2/50, 3/47, 4/125, 5/130 బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-1-28-0, ముఖేశ్‌ కుమార్‌ 4-0-33-2, అక్షర్‌ పటేల్‌ 4-0-23-2, సుందర్‌ 3-0-27-0, శివమ్‌ దూబే 2-0-9-1, బిష్ణోరు 3-0-35-0, భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (రనౌట్‌)ఇబ్రహీమ్‌/గుర్బాజ్‌ 0, శుభ్‌మన్‌ (స్టంప్‌)గుర్బాజ్‌ (బి)ముజీబ్‌ 23, తిలక్‌ వర్మ (సి)గుల్బద్దిన్‌ (బి)అజ్మతుల్లా 26, శివమ్‌ దూబే (నాటౌట్‌) 60, జితేశ్‌ శర్మ (సి)ఇబ్రహీం (బి)ముజీబ్‌ 31, రింకు సింగ్‌ (నాటౌట్‌) 16, అదనం 3. (17.3ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 159పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/28, 3/72, 4/117 బౌలింగ్‌: ఫారూఖీ 3-0-26-0, ముజీబ్‌ 4-1-21-2, నబీ 2-0-24-0, నవీన్‌ 3,3-0-43-0, అజ్మతుల్లా 4-0-33-1, గుల్బుద్దిన్‌ 1-0-12-0

➡️