రంజీ ట్రోఫీ సెమీఫైనల్.. ముంబై జట్టుకు శ్రేయస్ ఎంపిక

Feb 28,2024 13:33 #Ranji Trophy, #Sports
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తప్పక రంజీ బరిలో దిగేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో సెమీస్‌ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు ఇచ్చినట్లు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. వెన్ను గాయం, ఫామ్‌తో తంటాలు పడుతున్న శ్రేయస్‌ను ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ నుంచి ఇదే కారణంతో తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగాలన్న బీసీసీఐ నిబంధన నుంచి తప్పించుకునేందుకు వెన్నునొప్పిని కారణంగా చూపాడు. అయితే, జాతీయ క్రికెట్‌ అకాడమీ మాత్రం అయ్యర్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు తెలిపినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడకూడదనే శ్రేయస్‌ అయ్యర్‌ ఇలా చేసి ఉంటాడని.. ఈ నేపథ్యంలో అతడిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించే యోచనలో ఉందని వదంతులు వ్యాపించాయి. అయితే, తాజాగా తాను ఫిట్‌గా ఉన్నానంటూ అయ్యర్‌ రంజీల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం.

తమిళనాడుతో సెమీస్‌కు ముంబై జట్టు:
అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, భూపేన్ లాల్వానీ, అమోగ్ భత్కల్, ముషీర్ ఖాన్, ప్రసాద్ పవార్, హార్దిక్ తామోర్, శార్దూల్ ఠాకూర్, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్, ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, రాయ్‌స్టన్‌ డయాస్, ధావల్ కులకర్ణి.

➡️