Malaysia Masters: ఫైనల్‌కు సింధు

May 25,2024 22:16 #Badminton, #PV Sindhu

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌గీ500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో థారులాండ్‌ ప్లేయర్‌ బుసానన్‌పై ఘన విజయం సాధించింది. తొలి గేమ్‌ నుంచే సింధూ.. బుసానన్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఈ ఏడాది మాస్టర్స్‌ టోర్నీలో సింధూ ఫైనల్‌ అర్హత సాధించడం ఇదే తొలిసారి. సింధూ గత ఏడాది మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ ఫైనల్‌కు చేరింది. కాగా 2019లో హాంకాంగ్‌ ఓపెన్‌లో సింధును బుసానన్‌ ఓడించి టైటిల్‌ సాధించింది. ఈ మ్యాచ్‌ దాదాపు 88 నిమిషాల పాటు సాగింది. తాజా విజయంతో సింధూ తన ఓటమికి బదులు తీర్చుకుంది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్‌లో చైనా ప్లేయర్‌ వాంగ్‌ ఝీయితోస సింధు తలపడనుంది. మరో సెమీస్‌లో వాంగ్‌ 21-9, 21-11తో సహచర షట్లర్‌ జంగ్‌పై వరుససెట్లలో గెలిచింది. ఇక పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి విక్టర్‌ అక్సెల్సన్‌(డెన్మార్క్‌)-జంగ్‌(మలేషియా) ప్రవేశించారు.

➡️