RSA vs IND, 1st Test : 40 ఓవర్లు పూర్తి భారత్‌ 148/6

Dec 26,2023 14:13 #Cricket, #Sports

లంచ్‌ విరామం తర్వాత టీమిండియా వరుసగా వికెట్టు కోల్పోయింది. 92 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌(31) రబాడ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. అనంతరం 38 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. రబాడ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8 పరుగులు చేసిన అశ్విన్‌ ముల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో శార్ధూల్‌ ఠాకూర్‌(9), కేఎల్‌ రాహుల్‌(23) ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 40 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

  • 3 వికెట్లు డౌన్‌ .. భారత్‌ 91/3

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు దక్షిణాఫ్రికా పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 5 పరుగులు మాత్రమే చేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రబాడ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్‌ ఔటయ్యాడు.17 పరుగులు చేసిన యువ ఓపెనర్‌ జైశ్వాల్‌ బర్గర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌ బర్గర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 91 పరుగులు చేసింది. అయ్యర్‌(31), విరాట్‌ కోహ్లి(33) పరుగులు చేశారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

నేటి నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. సెంచురియన్‌ లో ఇవాళ తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ ఓడిపోవడంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ టెస్టు క్రికెట్‌ అరంగేట్రం చేస్తున్నాడు. రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడుతున్నాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

జట్లు

టీమిండియా : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌ మాన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.

దక్షిణాఫ్రికా : టెంబా బవుమా (కెప్టెన్‌), డీన్‌ ఎల్గార్‌, టోనీ డి జోర్జి, ఐడెన్‌ మార్‌ క్రమ్‌, కీగాన్‌ పీటర్సన్‌, డేవిడ్‌ బెడింగ్‌ హామ్‌, కైల్‌ వెర్రీన్‌ (వికెట్‌ కీపర్‌), మార్కో యన్సెన్‌, గెరాల్డ్‌ కోట్జీ, కగిసో రబాడా, నాండ్రే బర్గర్‌.

➡️