T20 World Cup: సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లు ఇవే..

Apr 30,2024 18:16 #T20, #World Cup

యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2024 జూన్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండటంతో ఆయా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌ తమ జట్టును ప్రకటించగా.. తాజాగా ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా తమ జట్ల వివరాలను వెల్లడించాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్‌ను జోస్‌ బట్లర్‌ ముందుండి నడిపించనున్నాడు. సౌతాఫ్రికాను ఐడెన్‌ మార్‌క్రమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐసీసీ ఈవెంట్‌లో మార్‌క్రమ్‌ కెప్టెన్సీ చేపట్టడం ఇదే మొదటిసారి.

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్‌ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, క్వింటన్‌ డి కాక్‌, జార్న్‌ ఫోర్టుయిన్‌, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, అన్రిచ్‌ నోకియా, కగిసో రబాడ, తబ్రెయిజ్‌ షంసి, ట్రిస్టన్‌ స్టబ్స్‌.

ట్రావెలింగ్‌ రిజర్వ్‌: నంద్రి బర్గర్‌, లుంగి ఎంగిడి.

ఇంగ్లాండ్‌ జట్టు: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ, జోఫ్రా అర్చర్‌, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్‌, బెన్‌ డకెట్‌, టామ్‌ హార్ట్లీ, విల్‌ జాక్స్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, అదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, రీస్‌ టాప్లీ, మార్క్‌ వుడ్‌.

➡️