T20 World Cup ఆదుకున్న రోహిత్‌, సూర్యకుమార్‌

భారత్‌ 171/7
ఇంగ్లండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అడ్డంకి
గయానా: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీస్‌కు వర్షం పలుమార్లు అడ్డంకిగా నిలిచింది. గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో తొలుత టాస్‌ కూడా ఆలస్యమైంది. నిర్ణీత సమయానికి ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడమే ఇందుకు ప్రధాన కారణం. పలుమార్లు ఔట్‌ఫీల్డ్‌ను అంపైర్లు పరీక్షించిన అనంతరం టాస్‌ వేయగా.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అనంతరం తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 171పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(57) అర్ధసెంచరీకి తోడు సూర్యకుమార్‌ యాదవ్‌(47) తృటిలో అర్ధసెంచరీని మిస్‌ చేసుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ మధ్యలోనూ ఒకసారి వర్షం అడ్డంకిగా నిలవడంతో దాదాపు గంటన్నరసేపు మ్యాచ్‌ నిలిచిపోయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యే సమయానికి దాదాపు నాలుగు గంట సమయం పట్టింది. టీమిండియా పవర్‌ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 46పరుగులు చేసింది. కోహ్లి(9), పంత్‌(4) నిరాశపరిచారు.
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ కోహ్లి(9) మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌(4) కూడా నిరాశపరచడంతో భారత జట్టు 40పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సూర్యకుమార్‌ యాదవ్‌-రోహిత్‌ శర్మ కలిసి 3వ వికెట్‌కు 73పరుగులు జతచేసి ఇన్నింగ్స్‌ను ఆదుకు న్నారు. చివర్లో హార్దిక్‌(23), జడేజా(17నాటౌట్‌), అక్షర్‌(10) బ్యాటింగ్‌లో మెరిసారు.

స్కోర్‌బోర్డు…
ఇండియా ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి)రషీద్‌ 57, కోహ్లి (బి)టోప్లే 9, పంత్‌ (సి)బెయిర్‌స్టో (బి)కర్రన్‌ 4, సూర్యకుమార్‌ (సి)జోర్డాన్‌ (బి)ఆర్చర్‌ 47, హార్దిక్‌ (సి)కర్రన్‌ (బి)జోర్డాన్‌ 23, జడేజా (నాటౌట్‌) 17, దూబే (సి)బట్లర్‌ (బి)జోర్డాన్‌ 0, అక్షర్‌ (సి)సాల్ట్‌ (బి)జోర్డాన్‌ 10, ఆర్ష్‌దీప్‌ (నాటౌట్‌) 1, అదనం 3. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 171పరుగులు. వికెట్ల పతనం: 1/19, 2/40, 3/113, 4/124, 5/146, 6/146, 7/170 బౌలింగ్‌: టోప్లే 3-0-25-1, ఆర్చర్‌ 4-0-33-1, కర్రన్‌ 2-0-25-1, రషీద్‌ 4-0-25-1, జోర్డాన్‌ 3-0-37-3, లివింగ్‌స్టోన్‌ 4-0-24-0.

➡️