Prajashakti వైద్యుల దినోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

  • ప్రజలను వైద్యులకు దూరం చేసే ప్రభుత్వ విధానాలు మారాలి : ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు జె సి నాయుడు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రజలకు వైద్యులను దూరం చేసే ప్రభుత్వ విధానాలు మారాలనీ ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు జెసి నాయుడు కోరారు. వైద్యులు దినోత్సవం సందర్భంగా …. ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం ప్రజాశక్తి స్టాఫ్‌ రిపోర్టర్‌ రమేష్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం సబాధ్యక్షులు రమేష్‌ నాయుడు మాట్లాడుతూ …. ప్రతి అక్షరం ప్రజల పక్షం అనే నినాదంతో ప్రజాశక్తి పని చేస్తుందన్నారు. ప్రజాశక్తి పత్రిక వార్తలు రాయడంతోపాటు సామాజిక కార్యక్రమాలు, విపత్తులు సంభవించే సమయంలో అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. బి సి రాయ్ జన్మదినం సందర్భంగా … వైద్యులు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. వైద్యులు సేవలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో సంచికను తీసుకొని, ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టామన్నారు.

అనంతరం వెంకటరమణ ఆసుపత్రి ఎండి.డాక్టర్‌ చిట్టిరమణరావు మాట్లాడుతూ … కరోనా సమయమలో వైద్యులు చేసిన సేవ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాశక్తి సామాజిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎపి మెడికల్‌ సేల్స్‌ రిప్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు యు ఎస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ … ప్రజలకు సేవ చేసే వైద్యులను సత్కరించే కార్యక్రమం ప్రజాశక్తి చేయడం అభినందనీయమన్నారు. వైద్యుల ప్రాధాన్యత ప్రజల్లోకి తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య వైద్యులను సత్కరించడం వల్ల వారు చేసిన సేవలకు గుర్తింపు ఉంటుందన్నారు. వైద్యుల మీద భౌతికదాడులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఆలోచించాలన్నారు. ఫార్మాసిటీ కంపెనీలు రాజకీయ కంపెనీలకు డబ్బులు ఇవ్వడం సరికాదన్నారు. నాసిరకం మందులు, సరైన మిషనరీ లేకపోవడం వలన ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందడంలో ఆలస్యం అవుతుంది తప్ప వైద్యుల తప్పు కాదన్నారు. ప్రజలకి సేవలు చేసే వైద్యులను కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. సమీకృత ఆహారం అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి ముందస్తు అవగాహన పెంచే కార్యక్రమాలు ప్రజాశక్తి చేయాలని కోరారు.

డాక్టర్‌.తిరుమలప్రసాద్‌ మాట్లాడుతూ … కేంద్రంలో, రాష్ట్రంలో వైద్య రంగానికి కేటాయింపులు తక్కువుగా ఉన్నాయన్నారు. వైద్యానికి, విద్యకు ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలన్నారు. నేడు 30 శాతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 70 శాతం ప్రైవేటు సెక్టర్లు లో వైద్యం ఉందన్నారు. 450 క్యాంప్‌ లు నిర్వహించామన్నారు. దేశంలో అత్యధికంగా వైద్య క్యాంప్‌ లు తిరుమల ఆసుపత్రి ద్వారా చేస్తున్నారన్నారు. ప్రజాశక్తి ద్వారా రోగాల పట్ల, ముందస్తు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సగం రోగాలు బారినపడకుండా కాపాడుకోగలమన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ప్రజాశక్తి, ప్రజాసంఘాలు చేసిన సేవలు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ప్రజాశక్తి వైద్యుల సేవలను గుర్తించి సంచిక వేసి గౌరవించడం అభినందనీయమన్నారు. డాక్టర్‌ సిరిన్‌ మాట్లాడుతూ … తమ సీనియర్‌ వైద్యులు తమకు మార్గదర్శకం అన్నారు. ఐ ఎం ఎ రాష్ట్ర అధ్యక్షులు జె సి నాయుడు మాట్లాడుతూ … బిధాన చంద్ర రారు వైద్యులుగా, రాజకీయ నాయకులు గా ప్రజలకు సేవలు అందించారన్నారు. డాక్టరుగా ఉన్న ఆయనకు భారతరత్న ఇవ్వడం చిన్న విషయం కాదన్నారు. పుట్టిన రోజు మరణించిన రోజు జూలై 1 కావడం వలన వైద్యులు దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు వైద్యులతో సంబంధం ఉంటుందన్నారు. వైద్యులను ఒత్తిడికి గురి చేయకుండా డాక్టర్‌ , రోగుల మధ్య సంబంధం గౌరవంగా సాగాలన్నారు. వైద్య వృత్తిని, వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైద్యుల మీద అనేక ఆరోపణలు రావడానికి కారణం ప్రభుత్వ విధానాలే అన్నారు. ప్రజలకు వైద్యులను దూరం చేసే పని ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. వ్యాపార దఅక్పథంతో చూడటం సరికాదన్నారు. 24 గంటలు ఒత్తిడితో వైద్యులు పనిచేస్తూ ఉంటారన్నారు. ప్రభుత్వాలు వైద్యులను సలహాదారులుగా ఉంచాలన్నారు. ఎమ్మెల్సీ పదవులు కూడా వైద్యులకు ఇవ్వాలని కోరారు. అందరి సహకారం ద్వారానే మెరుగైన సేవలు అందుతాయన్నారు. తమను గుర్తించి గౌరవించిన ప్రజాశక్తి కి అభినందనలు తెలిపారు.

ప్రజాశక్తి మేనేజర్‌ పి.గణేష్‌ మాట్లాడుతూ … వైద్యులు దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తి గా సంచికను తీసుకొని రావడం ఒకటే కాదు ఇంజినీరింగ్‌ దినోత్సవం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో పాటు వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విపత్తులు సంభవించే సమయంలో డొనేషన్లు వసూలు ఇవ్వడం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సమాజ గమనానికి దిక్సూచిగా ప్రజాశక్తి నడుస్తుందన్నారు. సేవా దృక్పథంతో ప్రజలకు తిండి, గూడు, గుడ్డ అవసరాన్ని పాలకులకు తెలియచేసే వార్తలు రాయడం జరుగుతుందన్నారు. ప్రజా దృక్పథంతో ప్రజాశక్తి పని చేస్తుందన్నారు. ఈ ప్రయాణంలో ప్రజాశక్తి కి సహకరిస్తున్న వైద్యులు, అన్ని వర్గాలవారికి ధన్యవాదాలు తెలిపారు. తమ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. బి సి రాయ్ సేవలు ప్రజలకు తెలియచేసి, వైద్యుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేయాలని ఉద్దేశంతో సంచికను తీసుకొని రావడం, వైద్యులను సత్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం ప్రజాశక్తి గా కఅషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఉద్యోగులు, సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థినిలు, పాల్గొన్నారు.

➡️