బెంగళూరు విజయం సాధించేనా..?

ఐపీఎల్‌-17లో హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీద ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ నేడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. మరోవైపు 4 మ్యాచ్‌లు ఆడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కేవలం 1 మ్యాచ్‌లో గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆర్‌సిబి రాజస్థాన్‌ను ఓడించి విజయాల పరంపరకు తిరిగి రావాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆర్‌సిబిని ఓడిచిం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కోనసాగాలని రాజస్థాన్‌ చూస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టు కొత్త జెర్సీతో ఆడనుంది. పూర్తిగా పింక్‌ కలర్‌తో ఉన్న జెర్సీని ఆ జట్టు ఆటగాళ్లు ధరించనున్నారు. రాయల్‌ రాజస్థాన్‌ ఫౌండేషన్‌(ఆర్‌ఆర్‌ఎఫ్‌) రాజస్థాన్‌ మహిళల సాధికారత కోసం కషి చేస్తున్నది. అందులో భాగంగా రాజస్థాన్‌-బెంగళూరు మ్యాచ్‌ను రాజస్థాన్‌ మహిళలకు అంకితం చేశారు. ‘పింక్‌ ప్రామిస్‌’ కాన్సెప్ట్‌తో పూర్తిగా పింక్‌ కలర్‌ జెర్సీని రాజస్థాన్‌ ఆటగాళ్లు ధరించనున్నారు.

జట్ల అంచనా..
రాజస్థాన్‌ : జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, షిమ్రాన్‌ హెట్మెయర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌, నాంద్రే బర్గర్‌, అవేష్‌ ఖాన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌.

బెంగళూరు : విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కెమెరూన్‌ గ్రీన్‌, అనుజ్‌ రావత్‌ (వికెట్‌ కీపర్‌), దినేష్‌ కార్తీక్‌, మయాంక్‌ దాగర్‌, రీస్‌ టోప్లీ, మహ్మద్‌ సిరాజ్‌, యశ్‌ దయాల్‌.

➡️