Women’s Interzonal Multi-Day Trophy: సౌత్‌జోన్‌ 133ఆలౌట్‌

Apr 9,2024 21:21 #Cricket, #Sports, #women cricket

ముంబయి: సౌత్‌-ఈస్ట్‌జోన్‌ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఇంటర్‌జోనల్‌ మల్టీ-డే టోర్నమెంట్‌లో సౌత్‌జోన్‌ బ్యాటర్లు తొలిరోజు ఆలౌటయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఫైనల్లో ఈస్ట్‌జోన్‌ బౌలర్‌ దీప్తి శర్మ ధాటికి సౌత్‌జోన్‌ జట్టు 133పరుగులకే కుప్పకూలింది. సౌత్‌జోన్‌ కెప్టెన్‌ మిన్ను మణి టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు మొగ్గు చూపగా.. ఈస్ట్‌జోన్‌ కెప్టెన్‌ దీప్తి శర్మ(4/30) ధాటికి సౌత్‌జోన్‌ బ్యాటర్లు కకావికలమయ్యారు. అరుంధతి రెడ్డి(57) అర్ధసెంచరీతో రాణించగా.. దీప్తికి తోడు టిటాస్‌ సద్ధు మరో నాలుగు వికెట్లతో సత్తా చాటింది. దీంతో సౌత్‌ జోన్‌ జట్టు తొలిరోజు 54.5ఓవర్లలో 133పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఈస్ట్‌జోన్‌ జట్టు ఆట ముగిసే సమయానికి 34ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 108పరుగులు చేసింది. రీచా ఘోష్‌(25) టాప్‌స్కోరర్‌.

➡️