అశ్రునివాళి అర్పించి.. సమరం శంఖం పూరించి..

ప్రజాశక్తి – భీమవరం

అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు అన్నారు. శనివారం భీమవరం, పాలకోడేరులో అంగన్‌వాడీలకు రారు సంఘీభావం తెలిపి నోటికి నల్ల రిబ్బను కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపి మాట్లాడారు. అనంతరం అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించి, అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ కె.వెంకటలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్‌ జ్యోతికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, విజయలక్ష్మి, ఇంజేటి శ్రీనివాస్‌, సిహెచ్‌.వెంకటేశ్వరరావు, గణేష్‌ పాల్గొన్నారు.టీచర్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి తీరని లోటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు అన్నారు. భీమవరం, పాలకోడేరు అంగన్‌వాడీల సమ్మెలో సాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రారు, అంగన్‌వాడీ హెల్పర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కళ్యాణి, సహాయ కార్యదర్శి హసీనా బేగం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి.వాసు, ఎం.ఆంజనేయులు, యూనియన్‌ నాయకులు విజయలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.పెంటపాడు : అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ చిత్రపటానికి అంగన్‌వాడీలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శిబిరం నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు, యుటిఎఫ్‌ నాయకులు మురళీకృష్ణ, జిల్లా నాయకురాలు అజరు కుమారి మాట్లాడారు. కార్యక్రమంలో పెనగంటి దుర్గా అంగన్‌వాడీలు పాల్గొన్నారు. ఆకివీడు : ఏ ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం లేదని, విజయం మనదేనని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కళ్యాణి అన్నారు. అంగన్‌వాడీల దీక్ష ఐదో రోజు కొనసాగింది. శనివారం అంగన్‌వాడీల దీక్ష వద్ద ఆమె మాట్లాడారు. ఆదివారం సెలవురోజు అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులతో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు పైడేశ్వరి, కృష్ణకుమారి, కనకదుర్గ, లక్ష్మి పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : అంగన్‌వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి. ముందుగా అంగన్‌వాడీలు ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అజరుకుమారి, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ఏలియమ్మ, సివిల్‌ సప్లై హమాలీలు సంఘీభావం తెలిపారు.ఉండి : అంగన్‌వాడీల సమ్మెకు సంఘీభావం ప్రకటించడానికి భీమవరం వస్తున్న ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని సిఐటియు మండల అధ్యక్షులు ధనికొండ శ్రీనివాస్‌, అంగన్‌వాడీలు అన్నారు. ఈ సందర్భంగా షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ధనికొండ శ్రీనివాస్‌, అంగన్‌వాడీ మండల అధ్యక్షులు చైతన్య మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొట్టాడ వెంకటేశ్వరరావు, మోపిదేవి రాము, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.మొగల్తూరు : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని స్టేట్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సోనీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఐదో రోజు కొనసాగిన దీక్షా శిబిరాన్ని యూనియన్‌ సభ్యులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, మొగల్తూరు సొసైటీ కార్యదర్శి కొత్తపల్లి గోవిందరాజు, సభ్యులు మాదాసు శేషగిరి, పైడిమర్రి సురేష్‌, చింతపల్లి శ్రీను పాల్గొన్నారు.ఆచంట : అంగన్‌వాడీ కేంద్రాలకు వేసిన తాళాలు పగలగొట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలలిచ్చారని చెబుతున్నారు గాని కలెక్టర్‌ను మీరు సస్పెండ్‌ చేయగలరా అని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సవాల్‌ విసిరారు. స్థానిక కచేరీ సెంటర్లో అంగన్‌వాడీలు చేపట్టిన నిరసన కొనసాగింది. ఈ కార్యక్రమానికి పితాని సంఘీభావం తెలిపి, సిఐటియు నాయకులతో దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, మండల అధ్యక్షులు కేతా మీరయ్య, నాయకులు బీరా నరసింహమూర్తి, తమ్మినేడి ప్రసాద్‌, ప్రభాకర్‌, కేతా మురళి పాల్గొన్నారు. కచేరీ సెంటర్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వైట్ల ఉషారాణి, మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మైలే విజయలక్ష్మి, పుడక నాగలక్ష్మి, శ్రీదేవి సత్యవతి సరోజినీ పాల్గొన్నారు.ఉండి : ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తగ్గేదే లేదంటూ అంగన్‌వాడీలు ఐదో రోజు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం.చైతన్య, డి.సత్యవేణి మాట్లాడారు. సిఐటియు మండల అధ్యక్షుడు కార్యదర్శులు ధనికొండ శ్రీనివాస్‌, కొట్టాడ వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు.తణుకు రూరల్‌ : అంగన్‌వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ హెచ్చరించారు. కోర్టు వద్ద చేపట్టిన దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడారు. సమ్మెకు సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గుబ్బల వెంకటేశ్వరరావు, సొసైటీ ఉద్యోగులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, శ్రీనివాస్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గార రంగారావు, వసంత, ప్రమీల, జ్యోతి, మధు షీల, ఎన్‌.కనకదుర్గ పాల్గొన్నారు.గణపవరం : ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, కూసంపూడి సురేంద్రరాజు, పల్లి వెంకటేశ్వరరావు, శ్రీనివాసు పాల్గొన్నారు.పెనుగొండ : అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను అధికారులు పగలగొట్టారు. ఈ మేరకు అంగన్‌వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండిఒ శ్రీనివాస్‌ దొర, తహశీల్దార్‌ ఎన్‌.గురుమూర్తి రెడ్డితో అంగన్‌వాడీల పెనుమంట్ర ప్రాజెక్టు లీడర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశ్వరరావు, మాదాసు నాగేశ్వరరావు, నాగిశెట్టి గంగారావు పాల్గొన్నారు. పాలకొల్లు : ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి కార్మిక, ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తీవ్ర సంతాపం తెలిపింది. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, పురుషోత్తం, సీనియర్‌ ఉపాధ్యాయుల నేత వలవల శ్రీరామ్మూర్తి, డి.అజరు, అంగన్‌వాడీ నేతలు శ్రీదేవి, నాగలక్ష్మి, సత్యవతి, ఝాన్సీ, పద్మావతి పాల్గొన్నారు.పోడూరు : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఐదో రోజు అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. దీక్షకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటీయు జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పిల్లి.ప్రసాద్‌, ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, జె.ఉమాదేవి, రాయుడు కుమారి, వైట్ల రాణి, బి.వెంకటరావు పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : అంగన్‌వాడీల సమ్మె ఐదో రోజు కొనసాగింది. అంబేద్కర్‌ సెంటర్లో దీక్షను కొనసాగించి ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి బాబు, గుర్తుల బలిచక్రవర్తి, సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము, అంగన్‌వాడీ నాయకులు పాల్గొన్నారు.యలమంచిలి : సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా తహశీల్దార్‌ సునీల్‌ కుమార్‌, ఎంపిడిఒ త్రిశూలపాణికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రజని, పద్మశ్రీ, దేవి పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : అంగన్‌వాడీలు సమ్మెలో భాగంగా శనివారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షరాలు దీన స్వరూపారాణి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు సిఐటియు పట్టణ కమిటీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, యూనియన్‌ తాడేపల్లిగూడెం ప్రాజెక్టు అధ్యక్షురాలు దీన స్వరూపరాణి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. అలాగే సమ్మెకు ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దాన వరప్రసాద్‌ మద్దతు తెలిపారు. అత్తిలి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. సమ్మెకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు మద్దతు తెలిపారు. అలాగే పి.సాయిరామ్‌, ఎ.దుర్గారావు, ఎన్‌వి.దుర్గ, కె.అఖిల్‌, జి.మణిరామ్‌కుమార్‌, పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు మద్దతు తెలిపారు. అనంతర్‌ సాబ్జీ మృతికి సంతాపం తెలిపారు. పెనుగొండ : ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల మొండివైఖరి అవలంబిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అన్నారు. ముందుగా అంగన్‌వాడీలు షేక్‌ సాబ్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. సమ్మెకు గోపాలన్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. అలాగే చినమల్లం, దొంగరావిపాలెం, సిధ్ధాంతం గ్రామాల సర్పంచులు, యుటిఎఫ్‌ టీచర్లు సంఘీభావం తెలిపారు. వీరవాసరం : అంగనవాడీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తాళాలు బద్దలు కొట్టి వికృత చేష్టలకు పాల్పడుతోందని, దీని పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్దకు శనివారం సిపిఎం జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, రైస్‌ మిల్లర్స్‌ వర్కర్ల యూనియన్‌ జిల్లా నాయకులు బి.వాసుదేవరావు వచ్చి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, పి.నాగరత్నం, సత్యవతి, నిర్మల, వై.వెంకటలక్ష్మి, ఎస్తేరు, శాంతి కుమారి, కె.సత్తిబాబు పాల్గొన్నారు.

➡️