కుష్టు వ్యాధిపై అవగాహన పెరగాలి

Jan 30,2024 21:15

ప్రజాశక్తి-విజయనగరం కోట  : కుష్టువ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు అన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన ర్యాలీని డిఎంహెచ్‌ఒ సర్వజన ఆస్పత్రి వద్ద ప్రారంభించారు. తొలుత కుష్టు నివారణకు సందేశం చదివి ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ ప్రాంతాలు, పాఠశాలలు, మతపరమైన స్థలాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎవరికైనా స్పర్శలేని మచ్చలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.రాణి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.సూర్యనారాయణ, జిల్లా న్యూక్లియర్‌ వైద్యాధికారి డాక్టర్‌ రామేశ్వరి ప్రభూ, కుష్టు నివారణ సిబ్బంది పాల్గొన్నారు.

➡️