జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా మంగపతిరావు

ప్రజాశక్తి – భీమవరం : జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా యు.మంగపతిరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మంగపతిరావు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొంది బదిలీపై జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా నియమితులయ్యారు. జిల్లా పరిశ్రమల అధికారిగా ఇప్పటివరకూ పనిచేసిన ఉయ్యాల ఆదిశేషు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతిపై ఏలూరు జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా నియమితులయ్యారు.

➡️