సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా

పిడుగురాళ్ల: అంగన్వాడీల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ బుధవారం పట్టణంలోని ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి తన అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు పెంచుతామని చెప్పి ఆచరణలో మాట తప్పని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్‌ డ్యూటీ నీ వెంటనే అమలు చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26,000 పెంచాలని, రిటైర్మెంట్‌ బెని ఫిట్స్‌ టీచర్‌ కు ఐదు లక్షలు, ఆయాకు రెండు లక్షల రూపా యలు ఇవ్వాలని, పెం డింగ్‌లో ఉన్న సెంటర్‌ అద్దెలు, కాన్వెంట్‌ బిల్లు వెంటనే విడుదల చేయాలని, రిటైర్మెంట్స్‌ పరి హారం ఆయాకు, టీచర్లకు పరిహారం వెంటనే ఇవ్వాలని, ఎఫ్‌ ఆర్‌ సి యాప్‌ను రద్దు చేయాలని,చివరి జీవి తంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలని, తదితర డిమాండ్ల కోసం డిసెంబర్‌ 8 నుంచి జరిగే నిరవధిక సమ్మెలో అంగ న్వాడీల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సిఐటియు మండల కార్యదర్శి తెగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 27,28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాలో కార్మి కులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని జయ ప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్య క్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు కార్య దర్శి డి.శాంత మణి, అంగన్వాడి వర్కర్స్‌ శివ రంజని, కవిత, బాజీబీ, జయ కుమారి , రాణి,హసీనా,శివకుమారి,రమాదేవి, ఆనంద కుమారి, సరస్వతి పాల్గొన్నారు. ప్రజాశక్తి- పల్నాడు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుం టూరు మల్లేశ్వరి డిమాండ్‌ చేశారు. నరస రావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం స్థానిక ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.అరుణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కెపి మెటిల్డాదేవి, కోశాది óకారి ప్రసన్న, నరసరావుపేట ప్రాజెక్టు కార్య దర్శి నిర్మల, రమణ, ఎటి యుసి నాయకు రాలు హెల్డాఫ్లారిన్‌, హసీనా, శివ పార్వతి పాల్గొన్నారు. ప్రజాశక్తి – వినుకొండఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫీస్‌ వద్ద ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమంలో వినుకొండ టౌన్‌, నూజెండ్ల, వినుకొండ మండలం, శావల్యాపురం మండలాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ టియు జిల్లా అధ్యక్షుడు హనుమంత రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాల పెంపు, గ్రాడ్యుటి, పెన్షన్‌ అమలు ఇతర సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్‌ 8 నుండి నిర్వహించే నిరవధిక సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించ కుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శిం చారు. వేతనాలు పెంచాలని వేతనాల పెంపు గ్రాటివిటీ అమలు తదితర సమస్యలు అనేకమార్లు విజ్ఞప్తి చేశామని మార్చి 23వ తేదీ న శాసనమండలిలో ఐసిడిఎస్‌ మంత్రి అంగన్వాడీ యూనియన్లతో మాట్లాడి సమ స్యలు పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని, అక్టోబర్‌ 9వ తేదీన అధికారులతో జరిగిన చర్చలలో కూడా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. డిసెంబర్‌ 8 నుండి అం గన్వాడీలు నిరవధిక సమ్మె చేయాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు, అనుబంధ అంగన్వాడీ యూనియన్లు నిర్ణ యించినట్లు చెప్పారు. డిసెంబర్‌ 8 నుండి నిరవధిక సమ్మె లోగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నా మని, ఇందులో భాగంగా సమ్మె నోటీసు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సంద ర్భంగా అంగన్వాడీ జిల్లా ట్రెజరర్‌ ఎఎల్‌ ప్రసన్న కుమారి మాట్లాడుతూ ఎలక్షన్‌ కంటే ముందు ఇచ్చిన హామీని అంగ న్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెం చాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగ న్వాడీలకు గ్రాడ్యుటిని మన రాష్ట్రంలో అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న మినీ సెంటర్లు అన్నింటిని మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, అంతవరకు మెయిన్‌ సెంటర్ల టీచర్లకు ఇచ్చే అంత వేతనం ఇవ్వాలని మొదలైన డిమాండ్లు చేశారు. కార్య క్రమంలో వినుకొండ టౌన్‌ కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు జి. పద్మ, బి. శ్రీదేవి పాల్గొన్నారు.

➡️