సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు

Jun 20,2024 22:22
సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు

మాట్లాడుతున్న ఎఒ శైలజ
సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యక రమైన ఉత్పత్తులను పొందే అవకా శముందని జిల్లా వనరుల కేంద్రం ఏఓ శైలజ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మాచర్లవారిపాలెం, ఈదూరు గ్రామాలలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి వి.వి శిరీష రాణి పర్యవేక్షణలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమాలకు డిఆర్‌సి ఏఓలు శైలజ, మధురిమలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పంటల రక్షణ, తెగులు నియంత్రణలో సహజ పద్ధతు లను ఉపయోగించడం, సాంస్కతిక చర్యలను స్వీకరించడం ద్వారా పొందిన ఉత్పత్తులను సేంద్రియ ఉత్పత్తి అంటారని తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ఆహార ఉత్పత్తి పద్ధతిలో మాత్రమే చూడకూడదని, స్థిరమైన వ్యవసాయం, అభివృద్ధి, పర్యావరణ పర్యాట కం, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పు కారకాల ప్రభావాన్ని తగ్గించే సాధనాల్లో ఒకటిగా చూడాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం నేల నష్టాలను నివారించడం, నీటి నాణ్యతను కాపాడడం చేస్తుందని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం, భూసార పరీక్షలు, సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. రసాయన ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల సంభవించే దుష్పరిణామాల గురించి తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంలో ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వైష్ణవి, విద్యాసాగర్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

➡️