దళితజాతి ఐక్యత కోసం పనిచేద్దాం

Dec 12,2023 00:26

ప్రజాశక్తి – చీరాల
పాలకులు మారుతున్నారు కానీ మెజారిటీ ఓటర్లయిన దళితుల తలరాతలు మారట్లేదని ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి ఏసురత్నం అన్నారు. స్థానిక గోలి సదాశివరావు కల్యాణ మండపంలో దళిత మహాసభ, కేవీపీఎస్, ఐక్య క్రిస్టియన్ జేఏసీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత నాయకుల ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ చీరాలలో మెజారిటీ ఓటర్లు ఎస్సి, ఎస్టీ లేనని, పాలకులు ప్రణాళిక బద్దంగా దళితుల ప్రాముఖ్యత తగ్గించారని అన్నారు. పాలకులు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితులను అణచి వేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఆడహక్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, గ్రామానికి ఒక పది మంది చొప్పున, పట్టణంలోని ప్రతి పేటలో ఈ కమిటీల ఆధ్వర్యంలోనే సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తామని అన్నారు. దళితుల ఓట్లతో గెలిచి దళిత పేటల్లో కనీస సౌకర్యాలు కల్పించని పాలకులకు తగిన బుద్ధి చెబుదామని అన్నారు. జాతి ఐక్యత కోసం పనిచేద్దామని అన్నారు. కార్యక్రమంలో సమాజ సేవకులు మోపర్తి జాన్, అమ్మ కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ అమృత పాణి, ఐక్య క్రిష్టియన్ జెఏసి జిల్లా అధ్యక్షులు గుమ్మడి రత్న ప్రకాష్, బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి గొర్రెపాటి రవి కుమార్, కెవిపిఎస్ నాయకులు లింగం జయరాజ్, జనసేన నాయకులు గూడూరు శివరామ ప్రసాద్, ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు మోహన్ కుమార్ ధర్మ, దళిత మహా సభ నాయకులు నూకతోటి బాబురావు, దళిత నాయకులు జంగం జయపాల్, పాస్టర్ బిళ్ళ యోహాన్, దేవరపల్లి బాబురావు, కట్టా గంగయ్య, మున్నంగి అరుణ్ కుమార్, ఎస్‌జె చిరంజీవి, పులిపాటి శేఖర్, పులిపాటి రవి, ఏరిచర్ల స్వామిదాసు, మోపర్తి నతానియెల్, డి అలెక్స్ పాల్గొన్నారు.

➡️