కిక్కిరిసిపోయిన జనం

May 13,2024 20:00

ప్రజాశక్తి – కాకినాడ రూరల్ : ఈరోజు ఎన్నికల సందర్భంగా కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట పంచాయతీ వద్ద ఓటర్లు బారులు తీరారు. హైస్కూల్ పోలింగ్ బూత్  లోకి  సుమారు వెయ్యి ఓటర్లు  వచ్చారు. ఎండ తీవ్రత వల్ల ఆరు గంటల తర్వాత  మహిళా ఓటర్లు   అత్యధిక సంఖ్యలో వచ్చారు. ఓటర్లు ఓటు వేయడానికి సుమారు ఇంకా 4 గంటలు పట్టే అవకాశం ఉంది. దీంతో పూర్తి బందోబస్తుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

 

➡️