పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో నిరసన

Jan 21,2024 11:59 #israel hamas war, #issrel

ఇటలీ : ఇటలీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అభరణాల ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఇజ్రాయెల్‌ ఎగ్జిబిటర్లకు నిరసన సెగ తగిలింది. పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ‘పాలస్తీనాను వదిలేయండి.. గాజాపై బాంబుల దాడి ఆపేయండి’ అని నిరసనకారలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ దిగారు. స్మోక్‌ బాంబులు అంటించి గందరగోళం సృష్టించారు. దీంతో పోలీసులు నిరసనకారులపై వాటర్‌ క్యానన్లు ప్రయోగించారు. కాగా 40 దేశాల నుంచి సుమారు1300 మంది ఎగ్జిబీటర్లు విసెంజాలో జరుగుతున్న అభరణాల ప్రదర్శన వచ్చారని ఎగ్జిబిషన్‌ నిర్వాకులు తెలిపారు. నిరసన కూడా ఎగ్జిబిషన్‌కు చాలా దూరంలో జరిగిందని.. నిరసన ప్రభావం ఎగ్జిబిషన్‌పై పడలేదని అన్నారు. ఈ నిరసనలను విసెంజా మేయర్ గియాకోమో పోస్సామై తీవ్రంగా ఖండించారు.

➡️