తిరుమలలో జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

తిరుమల : జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్‌ జయంతి ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఐదు రోజులు ఆకాశ గంగలో బాలాంజనేయ స్వామి అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 83,866 మంది భక్తులు దర్శించుకోగా, 44,479 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు యాత్రికులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.

➡️