AI: ‘ఆ’ వార్తలు ఆందోళనకరం

ఇంటర్నెట్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రాయబడిన వార్తలు, తప్పుడు సమాచారం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు  పెరుగుతున్నాయని రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ జర్నలిజం ప్రచురించిన ఒక నివేదిక వెల్లడించింది. ఇప్పటికే వార్త వినియోగదారులను నిమగ్నం చేయడానికి కష్టపడుతున్న న్యూస్‌రూమ్‌లకు ఈ నివేదిక తాజా సవాళ్లను విసిరింది. సోమవారం ప్రచురించబడిన ఈ నివేదిక గత సంవత్సర కాలంగా 47 దేశాలలో దాదాపు 100,000 మంది వ్యక్తులను సర్వేల చేసింది. ఆదాయాన్ని పెంచడంలో, వ్యాపారాన్ని కొనసాగించడంలో వార్తా మీడియా ఎదుర్కొంటున్న అడ్డంకులను ఈ నివేదిక వెల్లడించింది. టెక్ దిగ్గజాలు, గూగుల్,  OpenAI వంటి స్టార్టప్‌లు సమాచార సారాంశాలను వెబ్‌సైట్‌ల నుండి పొందుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా న్యూస్‌రూమ్‌లు ఉత్పాదక కృత్రిమ మేధస్సుతో కొత్త సవాలును ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయాల వంటి సున్నితమైన విషయాలపై వార్తల కంటెంట్‌ను రూపొందించడానికి AIని ఉపయోగించడంపై అనుమానాలు ఉన్నాయని నివేదిక కనుగొంది. యుఎస్ లో 52%, యుకెలో 63% మంది AIతో ఎక్కువగా ఉత్పత్తి చేయబడిన వార్తలతో అసౌకర్యంగా ఉన్నారని నివేదిక పేర్కొంది. అయితే జర్నలిస్టులు మరింత సమర్థవంతంగా పని చేయడానికి AI ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఆన్‌లైన్‌లో తప్పుడు వార్తల కంటెంట్ గురించి ఆందోళనలు గత సంవత్సరం కంటే మూడు శాతం  పెరిగాయి. కంటెంట్ విశ్వసనీయతపై ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపారు.

➡️