కాల్పుల విరమణ అమలుకు కృషి చేయండి

alestinian-ambassador-to-un-calls-on-non-aligned-movement-to-pressure-israel-to-enforce-cease-fire

పాలస్తీనా రాయబారి పిలుపు

కంపాలా(ఉగాండా) : మిలిటెంట్ పాలస్తీనా గ్రూప్ హమాస్‌తో 100 రోజుల యుద్ధం తర్వాత గాజాలో కాల్పుల విరమణను అమలు చేసేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఉగాండా, కంపాలాలోని నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ సభ్యులకు పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ పిలుపునిచ్చారు. సమావేశమైన 120 మంది సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యుఎన్ జనరల్ అసెంబ్లీ మరియు భద్రతా మండలి తీర్మానాలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ అస్పష్టంగానే ఉందన్నారు. వలస వ్యవస్థల పతనం, ప్రచ్ఛన్నయుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలో ఏర్పడిన నాన్-అలైన్డ్ ఉద్యమం డీకోలనైజేషన్ ప్రక్రియలలో కీలక పాత్ర పోషించిందని దాని వెబ్‌సైట్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై దాడి చేసి, దాదాపు 24,000 మందిని పొట్టనపెట్టుకుందని తెలిపారు. 80 శాతం మందిని ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి తరలివెళ్ళారని వెల్లడించారు. తాము ఇప్పటికీ ఇజ్రాయెల్ వలస ఆక్రమణలో ఉన్నామని, తమ ప్రజలపై, ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో జరిగిన మారణహోమం చూసామని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసినందుకు పాలస్తీనియన్లు దక్షిణాఫ్రికాకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️