రేపు బంగ్లా పార్లమెంటు ఎన్నికలు

Jan 6,2024 10:40 #Bangladesh, #elections

ముగిసిన ప్రచారం

ఢాకా: ఆదివారం జరిగే బంగ్లాదేశ్‌ 12వ పార్లమెంట్‌ ఎన్నికలకు ప్రచారం శుక్రవారంతో ముగిసింది. వాగ్దానాల వరద, రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలకు తెరపడింది. ఈ ఎన్నికలు ప్రాథమికంగా ఏకపక్షంగా జరగనున్నాయి. అయినా ప్రజల్లో ఆ ఎన్నికల మూడ్‌ పెద్దగా కనిపించడం లేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కాజీ హబీబుల్‌ అవల్‌ శనివారం సాయంత్రం 7 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే పాతుకుపోయిన రెండు పార్టీల రాజకీయ వ్యవస్థను బద్దలు కొట్టకుండా దేశ రాజకీయ పరిస్థితిలో మార్పు సాధ్యం కాదని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు వాస్తవిక సమాచారాన్ని వెల్లడించుకుండా దాచి పెడుతున్నారు. తద్వారా దేశ ప్రజలను అంధకారంలో ఉంచుతున్నారు. దీంతో ప్రజలు అయోమయంలో పడి ఎన్నికల పట్ల విశ్వాసం కోల్పోతున్నారు.ఒక సారి అధికారంలో ఉన్నవారు అధికారాన్ని వదులుకోరు. తమ వద్ద పోగుపడిన సంపదను కాపాడుకోవడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంపదలను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వస్తారు. రాజకీయాలను ‘నిజాయితీ లేని బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు రాజకీయ నాయకుల కూటమి’ చేతుల్లో దేశం బందీ అయిందని ఈ పరిస్థితి మార్చేందుకు ఎన్నికలే సరైన మార్గమని పరిశీలకులు పేర్కొన్నారు..

➡️