అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా

china-us-play-blamegame-over-warship-in-south-china-sea-

బీజింగ్‌ : చైనా ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టినట్లు చైనా సైన్యం ప్రకటించింది. చైనా-అమెరికా మధ్య శిఖరాగ్ర సదస్సు ముగిసిన కొన్ని రోజుల్లో అమెరికా కయ్యానికి కాలుదువ్వే చర్యలకు పాల్పడటం గమనార్హం. అమెరికా యుద్ధ నౌకను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేశామని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు ‘విచాట్‌’లో ఆదివారం పోస్టు చేసింది. అయితే దక్షిణ చైనా సముద్రంలో పరాసల్‌ ద్వీపాల వద్ద అంతర్జాతీయ జలాల్లో తమకు నౌకాయాన హక్కు ఉదంటూ అమెరికా బుకాయిస్తోంది. ఈ ప్రాంతంలో డెస్ట్రాయర్‌ హాప్పర్‌ యుద్ధ నౌకను మోహరించేందుకు అది చేసిన కుయుక్తులను చైనా తిప్పికొట్టింది. గత వారం అమెరికా డెస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ హాప్పర్‌ దక్షిణ చైనా జలాల్లోకి ప్రవేశించిందని, దీంతో తమ యుద్ధనౌకలు, వాయుసేన విమానాలు రంగంలోకి దిగి హాప్పర్‌ను ఆ జలాల నుంచి బయటకు పంపినట్లు చైనా సైన్యం పేర్కొంది. అంతేకాదు.. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా భద్రతా పరమైన సమస్యలు సష్టిస్తోందని తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఫిలిప్పీన్స్‌ విదేశీ బలగాలను చేర్చుకొంటోందని విమర్శించింది. ఇటీవలే ఫిలిప్పీన్స్‌-అమెరికా దళాలు ఇక్కడ సంయుక్త గస్తీ నిర్వహించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

➡️