హసీనాకు అభినందనల వెల్లువ

Jan 10,2024 10:36 #Bangladesh, #hasina, #prime minister
  • ఆసియన్‌, ఆఫ్రికన్‌, లాటిన్‌ అమెరికన్‌ నేతల సౌహార్ధ సందేశాలు
  • ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ అమెరికా, బ్రిటన్‌ యాగీ

ఢాకా: బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్‌ హసీనా నాల్గోసారి ఘన విజయం సాధించినందుకు అమెను ఆసియన్‌, ఆఫ్రికన్‌, లాటిన్‌ అమెరికా దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. హసీనా విజయాన్ని జీర్ణించుకోలేని అమెరికా, బ్రిటన్‌ దేశాలు ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ యాగీ చేయడం మొదలెట్టాయి. ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్‌ వోల్కర్‌ టర్క్‌ కొత్త ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటన చేస్తూ, వేలాదిమంది ప్రతిపక్ష సభ్యులను అరెస్టు చేశారని, ఎన్నికల రోజున పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు వార్తలందాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొననందున ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఆ ప్రకటనలో పేర్కొంది. హింస, అవకతవకల వార్తలపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని, బాధ్యులను జవాబుదారీ చేయాలని కోరింది. బిఎన్‌పి నేత బేగం ఖలీదా జియా కుమారునికి ఆశ్రయం కల్పిస్తున్న బ్రిటన్‌ కూడా ఇదే పాట పాడింది.

➡️