తజికిస్తాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

Jan 6,2024 12:31 #Earthquake

దుషాంబే : తజికిస్తాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం 6.42 గంటల సమయంలో తజికిస్తాన్‌లో భూకంపం సంభవించింది. వెడల్పు 37.24, పొడవు 71.74, లోతు : 80 కి.మీలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల ఆస్తి ప్రాణ నష్టాలకు సంబంధించిన సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

➡️