కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

అమెరికాలోని సెంట్రల్‌ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్‌ కాలిఫోర్నియాలోని మదేరా సిటీలో శుక్రవారం నాడు చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు రైతులతో పాటు పికప్‌ ట్రక్కు డ్రైవర్‌ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

➡️