యూట్యూబ్‌ మాజీ సిఇఒ కుమారుడు మృతి

Feb 18,2024 14:48 #Former YouTube CEO, #US University

వాషింగ్టన్‌ :    యూట్యూబ్‌ మాజీ సిఇఒ సుసాన్‌ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్‌ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ వారం ప్రారంభంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్కిలోని కాలిఫోర్నియా విశ్వవిదాలయంలోని తన డార్మిటరీలో మరణించినట్లు సభ్యులు ధృవీకరించారు. బర్కిలీ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రాణాలను రక్షించే చర్యలను చేపట్టారని,  అయితే అతను మరణించినట్లు ప్రకటించారని అన్నారు.   మృతికి గల కారణాలు తెలియరాలేదు.  అయితే, ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.   అయితే డ్రగ్‌ ఓవర్‌డోస్‌ కారణంగా చనిపోయి ఉంటాడని ట్రోపర్‌ అమ్మమ్మ ఎస్తేర్‌ వోజ్కికి అభిప్రాయం వ్యక్తం చేశారు.

➡️