ఉగాండాకు జి-77 ప్లస్‌ చైనా అధ్యక్ష బాధ్యతలు

Jan 23,2024 11:19 #G-77 plus, #Uganda

కంపాలా :  పేద దేశాల మధ్య సహకారానికి కొత్త ఊపునిచ్చే లక్ష్యంతో, అలాగే అంతర్జాతీయ సంక్షోభాలపై సభ్య దేశాల వైఖరి తెలియచేసేందుకు ఉగాండా రాజధాని కంపాలాలో ఆదివారం నాడు జి-77 ప్లస్‌ చైనా మూడవ సదస్సు జరిగింది.  ఈ సదస్సులో 70కి పైగా దేశాల ప్రతినిధులు, చైనా నేత పాల్గొన్నారు. ఇప్పటివరకు ఈ గ్రూపునకు క్యూబా అధ్యక్షురాలిగా వుంది. ఈ సదస్సులో ఈ బాధ్యతలను ఉగాండా అధ్యక్షుడు యోవెరి ముసొవెనికి అందచేయనుంది మొదటిసారిగా జి-77 ప్లస్‌ చైనా సమావేశాలకు క్యూబా హజరు కావడం గర్వకారణంగా వుందని, పైగా ఇది గౌరవనీయమని క్యూబా ప్రతినిధి వ్యాఖ్యానించారు. అభివృద్ధి దిశగా సాగుతున్న ఆఫ్రికా ఈ బాధ్యత చేపట్టడానికి పూర్తి అర్హురాలని అన్నారు. ఆఫ్రికాలో, అంతర్జాతీయంగా శాంతి సుస్థితరలను పెంచి పోషించడానికి ఉగాండా అధ్యక్షుడు ముసొవెని కృషి చేస్తున్నారని క్యూబా ప్రతినిధి కొనియాడారు. గాజాలో, ఉక్రెయిన్‌లో యుద్ధాలు సాగుతున్న నేపథ్యంలో కంపాలా సదస్సు జరుగుతోంది. కీలకమైన అంతర్జాతీయ ఆర్థికాంశాల్లో ఉమ్మడి కొనుగోలు శక్తిని పెంచేందుకు, సామూహిక ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించేందుకు జి-77 ప్లస్‌ చైనా ఒక సంకీర్ణ శక్తిగా పనిచేస్తోంది.

➡️