పాలస్తీనా ఖైదీలపై చిత్ర హింసలు

Dec 28,2023 08:58 #israel hamas war, #Palestine
Gaza-detainees-torture

 

తాజాగా వెలుగు చూసిన వీడియో

గాజా: ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని పాలస్తీనా పౌరులను వారి కుటుంబాల ఎదుటే ఉరితీస్తున్నాయని, అంతర్జాతీయ యుద్ధ నియమాలను, మానవ హక్కులను బాహాటంగా ఉల్లంఘిస్తూ ఖైదీలను బహిరంగ నిర్బంధ శిబిరాల్లో పెడుతున్నాయి. పాలస్తీనియన్‌ ఖైదీలను రక రకాల హింసా పద్ధతులను ప్రయోగిస్తున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అనేక మీడియా ఛానెళ్లు గత వారం విడుదల చేసిన వీడియో ఫుటేజ్‌, ఇజ్రాయెల్‌ దళాలు డజన్ల కొద్దీ పాలస్తీనియన్‌ ఖైదీలను బహిరంగ మైదానంలో (స్పష్టంగా ఒక స్టేడియం) బట్టలూడదీసి నగంగా కూర్చోబెట్టడాన్ని చూపించాయి. పాలస్తీనా ఖైదీల్లో చిన్నారులు, పసిపిల్లలు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

డిసెంబర్‌ 7న, ఒక ఇజ్రాయెల్‌ టీవీ ఛానెల్‌లో ఇలాంటి వీడియోలు ఫోటోల సెట్‌ ప్రసారం చేయబడింది, దీనిలో డజన్ల కొద్దీ పురుషులు తమ లోదుస్తులను తొలగించి వీధి మధ్యలో కూర్చోవడం లేదా ఇజ్రాయెల్‌ దళాలు ట్రక్కులో తీసుకెళ్లడం కనిపించింది. వీరు పాలస్తీనా రెసిస్టెన్స్‌ గ్రూప్‌ హమాస్‌కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు అని నివేదిక పేర్కొంది. వీడియోలో ఉన్న చాలా మందికి హమాస్‌తో ఎలాంటి సంబంధం లేదని, దాడి చేసిన ఇజ్రాయెల్‌ దళాలు వారిని నిర్బంధించి, అవమానించడం, హింసించడం వంటివి చేశాయని వారు ఆరోపించారు. పాలస్తీనా ఖైదీలను చిత్రీకరించిన ఇజ్రాయెల్‌ దళాలు నకిలీ లొంగుబాటును ప్రదర్శించాయని కూడా చాలా మంది పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ నేరాలపై తక్షణ మరియు నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉందని పాలస్తీనియన్‌ నేషనల్‌ ఇనిషియేటివ్‌ పార్టీ అధినేత ముస్తఫా బర్ఘౌటి, డిసెంబర్‌ 20న ఎక్స్‌(గతంలో ట్విట్టర్‌)లో, అల్‌-షిఫా హాస్పిటల్‌ డైరెక్టర్‌తో సహా వెయ్యి మందికి పైగా ఖైదీలు ఇజ్రాయెల్‌ దళాల చేతిలో క్రూర హింసకు గురయ్యారు.

➡️