మృతదేహాలతో నిండిపోతున్న గాజా ఆస్పత్రులు

Dec 5,2023 11:01 #bodies, #Gaza, #hospital, #overflowing
  • ఇజ్రాయిల్‌ దాడుల్లో 3 రోజుల్లోనే 800మందికి పైగా మృతి

గాజా : మృతదేహాలతో గాజా ఆస్పత్రులు నిండిపోతున్నాయని గాజా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మునీర్‌ అల్‌ బర్ష్‌ తెలిపారు. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వరుసగా నాలుగు రోజుల నుండి ఇజ్రాయిల్‌ మిలటరీ దక్షిణ గాజాలో విరుచుకు పడుతోంది. శనివారం నుంచి ఇప్పటివరకు 800మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అధికారులు తెలిపారు. అంబులెన్సులు, వైద్య సిబ్బందిని పదే పదే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. అల్‌ అద్వా ఆస్పత్రికి తీసుకెళుతున్న ఒక ఆరోగ్య సంరక్షణ కార్యకర్తని కాల్చి చంపారు. 40వేల మంది గాయపడితే, 400మంది రఫా క్రాసింగ్‌ను చేరుకోగలిగారని డైరెక్టర్‌ తెలిపారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో తెల్లవారుజామున ఇద్దరు పాలస్తీనియన్లను కాల్చి చంపగా, 60మందిని అరెస్టు చేశారు. రెడ్‌క్రాస్‌ చీఫ్‌ సోమవారం గాజాలో పర్యటించారు. తక్షణమే సాయం అందాలని ఆయన అన్నారు. సోమవారం ఉదయం నుండి ఇజ్రాయిల్‌ ట్యాంకులు, సాయుధ వాహనాలు తూర్పు ప్రాంతం నుండి ఖాన్‌ యునిస్‌ దిశగా వెళుతున్నాయి.

➡️