ఆస్ట్రేలియా సెనెటర్‌గా భారత సంతతికి చెందిన దేవ్‌శర్మ ప్రమాణం

Dec 5,2023 11:05 #Australian senator, #Indian, #origin

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో భారత సంతతికి చెందిన మొదటి పార్లమెంట్‌ సభ్యుడు దేవ్‌శర్మ సోమవారం సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ సౌత్‌ వేల్స్‌లో జరిగిన సెనెట్‌ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. న్యూ సౌత్‌వేల్స్‌ మాజీ మంత్రి ఆండ్రూ కాన్‌స్టన్స్‌ను ఆయన 251-206 ఓట్ల తేడాతో ఓడించారు. సెనెట్‌ నుండి రిటైరవుతున్న మాజీ విదేశాంగ మంత్రి మారిసె పాయనె స్థానంలో దేవ్‌ శర్మ నియమితులు కానున్నారు. ఫెడరల్‌ లిబరల్‌ బృందంలో అదనంగా వస్తున్న శర్మకు స్వాగతం అంటూ లిబరల్‌ పార్టీ డిప్యూటీ నేత సుశాన్‌ లే వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానాలకు సంబంధించి మేథావి అయిన దేవ్‌కు పార్లమెంట్‌, సీనియర్‌ దౌత్య విభాగాల్లో అపార అనుభవం వుందని లే పేర్కొన్నారు. 2013-2017 మధ్య కాలంలో ఇజ్రాయిల్‌కు ఆస్ట్రేలియా రాయబారిగా శర్మ పనిచేశారు.

➡️