ఆ దాడితో మాకు సంబంధం లేదు

Dec 26,2023 11:05 #Iran, #US accusation
  •  అమెరికా ఆరోపణలపై ఇరాన్‌

టెహ్రాన్‌ :    ఇటీవల అరేబియా సముద్రంలో భారత్‌ వైపు వస్తున్న కెమికల్‌ ట్యాంకర్‌ నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎర్రసముద్రంలో భారత్‌కి వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌పై డ్రోన్‌ అటాక్‌ జరిగింది. భారత్‌ సమీపంలో అరేబియా సముద్రంలో జరిగిన దాడి ఇరాన్‌ పనే అని అమెరికా ఆరోపించింది. అమెరికా ఆరోపణల్ని ఇరాన్‌ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్ని ‘విలువ లేనివి’గా ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. పెంటగాన్‌ ఆరోపించిన తర్వాత టెహ్రాన్‌ నుంచి ఈ తరహా ప్రతిస్పందన వచ్చింది. అమెరికా వాదనల్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని, విలువలేనివిగా ప్రకటిస్తున్నామని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్‌ కనాని అన్నారు. ఇటువంటి వాదనలతో గాజాలో నియోనిస్టు పాలన (ఇజ్రాయిల్‌) నేరాలను అమెరికన్‌ ప్రభుత్వం కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఇరాన్‌ చెప్పింది.

➡️