Attacks – లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

Mar 24,2024 08:32 #airstrikes, #Israel, #Lebanon

లెబనాన్‌ : ఇజ్రాయెల్‌ మిసైల్‌ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్‌ డోమ్‌పై డ్రోన్‌లతో దాడులు జరిపినట్లు హెజ్బల్లా ప్రకటించిన గంటల్లోనే … ఇజ్రాయెల్‌ లెబనాన్‌ పై దాడులకు దిగింది. లెబనాన్‌ నుంచి 50 రాకెట్లు తమవైపు వచ్చినందునే దాడులు చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్‌లోని మిలిటెంట్‌ గ్రూపు హెజ్బల్లా, ఇజ్రాయెల్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగిపోయాయి.

లెబనాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది. మిలిటెంట్‌ గ్రూపు హెజ్బల్లాకు గట్టిపట్టున్న ప్రాంతమైన బల్బీక్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు బల్బీక్‌ మేయర్‌ వెల్లడించారు. ఈ రాకెట్‌లలో కొన్నింటిని కూల్చివేశామని, మరికొన్ని మనుషులు లేని చోట పడిపోయాయని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఈనెల 12 న బల్బీక్‌ పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు మఅతి చెందగా 20 మంది వరకు గాయపడిన సంగతి విదితమే.

➡️