ఫాసిజాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఫ్రాన్స్‌లో కొత్త పాపులర్‌ ఫ్రంట్‌

Jun 19,2024 23:58 #France, #New Popular Front

పారిస్‌ : ఫాసిజాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులతో కూడిన పాపులర్‌ ఫ్రంట్‌ తెలిపింది. ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ఫాబియన్‌ రౌసెల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యూరోపియన్‌ యూనియన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన మితవాద పార్టీలు, జాతీయ పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్‌ చేయాలని చూస్తున్నాయని, వారి ఆటలు సాగనివ్వమని చెప్పారు..గత వారం జరిగిన ఇయు పార్లమెంటరీ ఎన్నికల్లో అతిపెద్ద ఫ్రెంచ్‌ శక్తిగా రాస్సెంబ్లెమెంట్‌ నేషనల్‌ (నేషనల్‌ ర్యాలీ) పార్టీ అవతరించింది. అనేక నయా-ఫాసిస్ట్‌ పార్టీల మాదిరిగానే, నేషనల్‌ ర్యాలీ కూడా పెట్టుబడిదారీ పాలకవర్గప్రతినిధిగానే వ్యవహరిస్తోంది. నయా ఉదారవాద విధానాలను జోరుగా అమలు చేస్తోంది. 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన లీ పెన్‌, ఈసారి పార్లమెంటరీ ఎన్నికలో విజయం సాధించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. జాతీయ ర్యాలీ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే దేశం ఫాసిస్టుల చేతుల్లోకి పోయే ప్రమాదముందని ఫ్రెంచ్‌కమ్యూనిస్ట్‌ పార్టీ పేర్కొంది. ఇది స్వల్పకాలిక ఎన్నికల పొత్తు కాదు, శాశ్వత కూటమిగా రూపొందుతుందని నాలుగు పార్టీల నాయకులు ఉద్ఘాటించారు. ట్రేడ్‌ యూనియన్‌లు, ప్రజా సంఘాలు, పర్యావరణ సంఘాలు , ఇతర పౌర సంఘాలు ఇప్పుడు న్యూ పాపులర్‌ ఫ్రంట్‌కి మద్దతుగా ర్యాలీల్లో పాల్గొంటున్నాయి…

➡️