YCP: అక్రమ కట్టడాలకు కేరాఫ్ వైసిపి

  •  రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిపోయింది 
  • అక్రమాలు, దండాలలో వైసీపీ నెంబర్ వన్ 
  • ఎమ్మెల్యే పూసపాటి అదితి

ప్రజాశక్తి-విజయనగరం కోట : అక్రమ కట్టడాలే వైసీపీకి నిదర్శనమని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం నాడు స్థానిక దాసన్నపేట రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే , జనసేన బిజెపి నాయకులు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలు చేసి పార్టీ ఆఫీసులు కట్టడం జరుగుతుందన్నారు అదేవిధంగా విజయనగరంలో కట్టిన పార్టీ కార్యాలయం కూడా అక్రమమే అని అన్నారు 100 శంకుస్థాపనలు 200 శంకుస్థాపనలు అని చెప్పుకు తిరగడమే తప్ప వాస్తవంలో చేసింది ఏమీ లేదన్నారు ప్రతి చిన్న దానికి ఒక బల్బు వేసిన కొబ్బరికాయలు కొట్టి హంగామా చేసే నాయకులు పార్టీ కార్యాలయం విషయంలో ఎంత సీక్రెట్ మెంటెనెన్స్ చేయవలసిన అవసరమేమని మండిపడ్డారు ఇంత సీక్రెట్ మెంట్ నే చేశారు కాబట్టే ప్రజలు అందరూ తిరుగుబాటు చేస్తున్నారన్నారు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైసిపి పార్టీపై తిరుగుబాటు చేసి ఓటు రూపంలో కూటమికి తిరిగి లేని విజయాన్ని అందించారని అన్నారు ల్యాండ్ దందాలు ఇతర అక్రమంలో వైసిపి వాళ్ళే నెంబర్ వన్ అన్నారు ప్రజలే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని కోటమికి విజయం కట్టబెట్టారన్నారు జిల్లాలో రెవెన్యూ ఎడ్యుకేషన్ వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ స్వామి ఇల్లు ఒకటే అన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగు యువత అధ్యక్షులు గంటా రవి ఆర్ టి ఐ యాక్ట్ ద్వారా అడిగిన ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు ఈ వైసీపీ పార్టీ అన్ని విధాలుగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు అన్ని విధాలుగా ఒక క్లారిటీతో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఇది అక్రమ కట్టడమే అని మున్సిపాలిటీ వారు నోటీసు అంటించిన మరుక్షణమే వైసిపి నాయకులు చించి పారేయడం వారికే చెలుతుందన్నారు. ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి అధిష్టానానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు భవిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ అక్రమ కట్టడమే అన్నారు గతంలో ఎమ్మార్వో వారికి మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ ఇచ్చిన చర్యలు తీసుకోలేదని అన్నారు కూటమి నాయకత్వంలో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపీ రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బీసీ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్, గాడ్ అప్పారావు, పాశి అప్పలనాయుడు, కండువా ప్రకాష్ కండువా ప్రకాష్, జనసేన నాయకులు శాంతి, రౌతు సతీష్ , ఉమ్మడి పార్టీల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

➡️